హైదరాబాద్‌లో ఉచిత సేవ కోసం మరో 8 కొత్త అంబులెన్స్‌లు

 హైదరాబాద్‌లో ఉచిత సేవ కోసం మరో 8 కొత్త అంబులెన్స్‌లు
  • జెండా ఊపి ప్రారంభించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
  • సహాయం కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు: 94906 17431 & 94906 17440

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ మహా నగరంలో ఉచిత సేవ కోసం మరో 8 కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో కొత్త అంబులెన్స్ లను సీపీ సజ్జనార్ వీటిని జెండా ఊపి ప్రారంభించారు. మహానగరం పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవలు అవసరమైతే..  పోన్ నెంబర్లు: 94906 17431,94906 17440 కు ఫోన్ చేయాలని ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ 8 అంబులెన్స్ లు హైదరాబాద్ నగరంలో ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని, మరో నాలుగు సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఐటి సంస్థల సహకారంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇన్స్ స్పెక్టర్ ర్యాంక్ అధికారి దీన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. డయాలసిస్, కోవిడ్ బాధితులు, గర్భిణులు, అత్యవసర సేవలు కావాల్సిన వారు ఈ అంబులెన్స్ లను వినియోగించుకోవచ్చని, ఇవి పూర్తిగా ఉచితం అన్నారు. నగరంలో ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు కోవిడ్-19 సమయంలో ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.